జ‌గ‌న్ లేఖ‌పై ఏపీ గ‌వ‌ర్న‌ర్ స్పందిస్తారా….!

-

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని ముప్పుతిప్ప‌లు పెట్టేలా క‌నిపిస్తున్నారు మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. రాష్ట్రంలో హ‌త్య‌లు, అరాచ‌కాలు జ‌రుగుతున్నాయంటూ దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో మూడు రోజ‌లు పాటు ధ‌ర్నా చేసిన జ‌గ‌న్‌… రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపారు. అంత‌టితో ఆగ‌కుండా రాష్ట్ర‌ప‌తితో పాటు ప‌లువురు మంత్రుల‌ను క‌లిసి విన‌తులు ఇచ్చారు. ఇప్పుడు మ‌రోసారి కూట‌మిపై విరుకుప‌డ్డారు జ‌గ‌న్‌. ఇటీవ‌ల అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ చేసిన ప్ర‌సంగం గురించి ఏడు పేజీల లేఖ‌ను విడుద‌ల చేశారాయాన‌. గవర్నర్ చేసిన ప్రసంగంలో అనేక త‌ప్పులు, వక్రీకరణలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మొదలుకుని పోలవరం ప్రాజెక్టు, చేసిన అప్పుల వరకు అన్నింటినీ వివరంగా పొందుపరిచారు. కూట‌మి ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌తో త‌ప్పుడు స‌మాచారం చ‌దివించార‌ని లేఖ‌లో పేరొన్న జ‌గ‌న్ సంచ‌ల‌నం సృష్టించారు.

లేఖ‌లో జ‌గ‌న్ ఏఏ అంశాల‌ను ప్ర‌స్తావించారంటే 2014- 2019 మ‌ధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయినట్లు కూట‌మి ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌తో చెప్పించింద‌ని, వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని 55,548.87 కోట్ల రూపాయలుగా పేర్కొంది. కేవ‌లం 11,923 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 72 శాతం పనులు ఎలా పూర్తిచేసింద‌ని జగన్ ప్రశ్నించారు.

ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి ఖర్చూ చేయలేదని గవర్నర్ ప్రసంగంలో ఉందని, ఇది కూడా అవాస్తవమేనని జగన్ చెప్పారు. 2019 ఆగస్టు నాటికి రాష్ట్రంలో 30,74,310 ఇళ్లకు మాత్రమే మంచినీటి కుళాయిల కనెక్షన్లు ఉండగా.. తమ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్యను 70,11,885కు చేర్చామని చెప్తూ 2024 జూన్ వరకు ఈ సంఖ్య ఎలా పెరిగిందో కనీసం టీడీపీ చెప్పగలుగుతుందా? అని ప్రశ్నించారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రాష్ట్రం అప్పులు 1,18,051 కోట్ల రూపాయలు ఉండగా 2019లో టీడీపీ ప్ర‌భుత్వం దిగిపోయే సమయానికి 130 శాతం పెరిగాయి.

అంటే ఈ సంఖ్య 2,71,798 కోట్ల రూపాయలకు చేరిందని జ‌గ‌న్‌ వివరించారు. 2024 నాటికి రాష్ట్రం అప్పులు 5,18,708 కోట్ల రూపాయలకు చేర‌గా ఈ సంఖ్య 90 శాతం పెరిగిందని చెప్పారు. దీనికి భిన్నమైన అంకెలు గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయని అన్నారు. 2014-2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వరంగ కంపెనీల అప్పులు, గ్యారంటీల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 21.63 శాతం ఉండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో దీన్ని 12.90 శాతానికే పరిమితం చేశామని జగన్ పేర్కొన్నారు. అఖ‌రికి దీనిపైన కూడా కూట‌మి ప్ర‌భుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని జ‌గ‌న్ అన్నారు.

జ‌గ‌న్ లేఖ‌తో ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన‌ట్లైంది. జ‌గ‌న్ ఇచ్చిన లేఖ ప్ర‌కారం చూస్తే దేవాల‌యం లాంటి అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ త‌ప్పుడు స‌మాచారం చ‌దివార‌ని వైసీపీ భావిస్తోంది. ఏపీ ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. లెక్క‌ల విషయంలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ‌మే జ‌వాబుదారీ అని చెప్పిన జ‌గ‌న్‌.. కూట‌మి చెప్పిన లెక్క‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ ద్వ‌రా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ లేఖ‌పై ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ఏ మేర‌కు స్పూందిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి ఘోర ఓట‌మి త‌రువాత ఏమాత్రం కుగిపోని జ‌గ‌న్‌.. కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ టాపిక్ ఏపీలో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news