ఆంధ్ర జ్యోతి మీద కే‌సి‌ఆర్ చర్యలు ఉండబోతున్నాయా ?

-

ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం తెలుగు మీడియా రంగంలో ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ టీడీపీకి ఫేవర్ గా పని చేస్తుందని చాలా మంది అంటారు. అధికారంలో టీడీపీ తప్ప వేరే వేరే ఇతర పార్టీలు ఉంటే వాటిపై ప్రజాగ్రహం వచ్చే విధంగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహరిస్తుందని తెలుగు రాజకీయ నేతలు అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఏపీలో మరియు తెలంగాణలో వైయస్ జగన్ కి, కేసీఆర్ కి ఫస్ట్ నుండి వ్యతిరేకంగానే వ్యవహరిస్తోంది. ఏపీ లో ఐతే చెప్పక్కర్లేదు. కాగా తెలంగాణలో మొదటిలో వ్యతిరేకంగా ఉన్న తర్వాత కొద్దిగా తగ్గటం జరిగింది.CM KCR Extends Lockdown In Telangana Till May 7thఅయితే ఇటీవల కరోనా వైరస్ రావటంతో ఇష్టానుసారంగా కేసీఆర్ నిర్ణయాలపై వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి  పత్రికల్లో మరియు ఏబీన్ మీడియాలో కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఇదే సమయం లో కరోనా వైరస్ కట్టడి విషయంలో కేసీఆర్ కొన్ని చిల్లర పత్రికలు అంటూ ఇండైరెక్టుగా ఆంధ్రజ్యోతిపై అప్పట్లో  సీరియస్ అయినా విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయం నడుస్తూ ఉండాగాన్నే కరోనా వైరస్ కారణంగా ఎవరైనా ఉద్యోగాల నుండి తీసేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కేసీఆర్ సర్కార్ ముందే చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్య కేసీఆర్ ముందుకు వచ్చింది. ఇటీవల లాక్ డౌన్ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన చివరలో కేసీఆర్ కు కొందరు పాత్రికేయులు తమ యాజమాన్యాలు చేస్తున్న అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

 

దీంతో వారి సమస్యలు విని కేసీఆర్ ఆశ్చర్యపోయారు. వెంటనే కాగితంపై కంప్లైంట్ ఇవ్వండి నేను చూసుకుంటాను లేకపోతే మీకు అంతగా ప్రాబ్లం ఉంటే పర్సనల్ గా కలవండి చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఎక్కువగా తెలుగు మీడియా రంగంలో ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం తన సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయులను ఉద్యోగం నుంచి ఎక్కువగా తీసేస్తున్నారట. కొంతమంది ఉద్యోగస్తులకు జీతాల్లో కోతలు విధిస్తుందట. సగం సగం జీతాలు ఇస్తూ సరిపెడుతున్నారట. దీంతో పాత్రికేయుల కష్టాలు విని కేసీఆర్ బాధపడరు. ఇదే సమయం లో తనను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ పై తనకి రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులే ఫిర్యాదు చేయడంతో కేసీఆర్ మ్యాగ్జిమం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కి కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నట్లు మీడియా వర్గాల్లో టాక్.

Read more RELATED
Recommended to you

Latest news