వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని నెలల క్రితం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. వెంటనే ఆయన్ని రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించారు.. అప్పటినుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. ప్రజలతో మమేకమై వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ స్క్రీన్ మీదకు వచ్చింది..
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఇద్దరు అధినేతలు ప్రకటించారు.. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో పై గత కొద్ది రోజులుగా తీవ్రమైన కసరత్తు జరుగుతుంది.. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారు అయిందని తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ వార్త హల్చల్ వస్తుంది..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాలలో జనసేనకి ఒక సీటును కేటాయించి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం నెల్లూరు సిటీ గాని లేదా రూరల్ గాని తమ పార్టీకి కేటాయించాలని చంద్రబాబుకి ప్రతిపాదన పంపారట.. దీనిపై చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారని పార్టీలో చర్చి నడుస్తోంది.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు సిటీ నుంచి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు.. చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితులు కావడంతో ఆయనకు టిక్కెట్టు నూటికి నూరు శాతం ఖరారు అయినట్లే.. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ టికెట్ను జనసేనకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది.. అదే జరిగితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మొండి చెయ్యి దక్కే అవకాశాలు ఉన్నాయని టిడిపి ముఖ్య నేతలు చెబుతున్నారు..
చంద్రబాబు నాయుడ్ని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై తీవ్రమైన విమర్శలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్ రాకపోతే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి మరి..