రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్ కాబోతున్నారా ?

-

కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడు ఎన్నికపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది… 2021 జూన్‌లో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠంపై కూర్చోబోన‌ని తెగెసి చెప్పారా గెహ్లాట్‌ను సడెన్‌గా హస్తినకు పిలిపించి చర్చలు జరపడం వెనక ఉన్న మతలబు ఇప్పుడు ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్‌ పార్టీ ఎలక్షన్ అథారిటీ ఇప్పటికే మేలో ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ ఉంటుందని ప్రకటించగా ఆ నిర్ణయాన్ని కొన్ని కారణాల వల్ల జూన్‌ 2021లో పూర్తి చేయాలని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో హస్తం పార్టీ ఘోర ప‌రాభ‌వానికి బాధ్యత వ‌హిస్తూ.. రాహుల్ గాంధీ అధ్యక్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అప్పటి నుంచి సోనియా గాంధే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొన‌సాగుతున్నారు. తాత్కాలిక పదవి కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.

జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను నియమించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కేబినెట్ విస్తరణలో నిమగ్నమైన అశోక్ గెహ్లాట్‌కు సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చిందని, దీంతో ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నాయకులు కొందరు చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపించిన పక్షంలో అశోక్ గెహ్లాట్ ను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయ్‌.

గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన అశోక్ గెహ్లాట్ కే పగ్గాలు అప్పగిస్తే, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ఆయనకు మద్ధతు ఇస్తారన్న ప్రచారం పార్టీలో వినిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌లో పార్టీలో మార్పులు చేర్పులకు ఒక అడుగు ముందుకు పడటం మళ్ళీ ఆ నిర్ణయం జూన్ కి వాయిదా పడటం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news