డిల్లీలో కేంద్ర క్యాబినెట్ విస్తరణలో భాగంగా జనసేనకు బిజెపి మొండిచేయి చూపించింది.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం మీద ఐదుగురికి స్థానం కల్పించింది.పవన్‌ను ఇష్టపడే ప్రధాని జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అసలు అడ్డు పడిందెవరు? అనే దానిపై ఏపీలో చర్చ మొదలైంది.చంద్రబాబే అడ్డుకున్నాడా లేక భవిష్యత్ గ్యారంటీతో మోడీ పక్కన పెట్టేశారా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
ఏపీ నుంచి కేబినెట్లో ఇద్దరు టిడిపి ఒక బిజెపి ఎంపీ కి అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి బిజెపి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇటీవలే బిజెపి ,టిడిపి, జనసేన పార్టీకి హైప్ రావడానికి ముఖ్య కారణం జనసేనపార్టీ అయినప్పటికీ కూడా ఈ పార్టీకి సంబంధించి ఎంపీల విషయంలో ఎవరినీ కేబినెట్లోకి తీసుకోలేదు.జనసేన ఎంపీ బాలశౌరికి మోడీ క్యాబినెట్లో అవకాశం ఇస్తారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. టిడిపి బిజెపి మధ్య పొత్తు కుదిర్చడంలో తనే కీలకంగా మారినట్టు పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా అన్నిచోట్ల ప్రధమ అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ తాజా పరిణామంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు.
ప్రస్తుతానికి జనసేన ను మాత్రం కేంద్ర క్యాబినెట్లోకి అవకాశం లేనట్లే.ఒక కమ్మ ,క్షత్రియ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు.కాపులను ప్రస్తుతానికి పక్కన పెట్టడంతో ఇప్పుడు రాజకీయాలలో ఈ విషయం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.ఇదివరకే కేంద్ర మంత్రివర్గంలో కీలక పదవి దక్కుతుందని వార్తలు వినిపించారు.దీంతో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నారు.కానీ ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.సరే ఇప్పుడు జనసేన ఎంపీలకు అయిన మంత్రి అవకాశం దక్కిందా అంటే అదీ లేదు. అయితే పవన్ కి బీజేపీ నేతలు ఎం చెప్పి ఉంటారు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. కేబినెట్ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో పవన్ కూడా కొంత నిరాశక్తి గా కనిపించారు.దీనిని బట్టి చూస్తే పవన్ ని బీజేపీ మోసం చేసిందా అనే అనుమానాలు జనసేన కెడర్లో కలుగుతున్నాయి. మరి ఈ విషయం పైన పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.