కేటిఆర్ అన్న ఒక్క మాటతో కాంగ్రెస్ కి దిమ్మ తిరిగింది…!

-

సాధారణంగా రాజకీయాల్లో తెలంగాణా యువనేత, మంత్రి కేటిఆర్ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎవరి క్రెడిట్ వాళ్లకు ఇవ్వడంలో ఆయన ఎప్పుడు ముందు ఉంటారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్లకు ఇవ్వడంలో కేటిఆర్ దిట్ట. అందుకే కెసిఆర్ కి చంద్రబాబుకి ఎన్ని విభేదాలు ఉన్నా సరే, తాను కూడా ఎన్ని విమర్శలు చేసినా సరే వాటిని రాజకీయాల వరకే పరిమితం చేసి చంద్రబాబు సాధించిన విజయాలను ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు.

తెలంగాణా ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబు చేసిన కార్యక్రమాన్ని ఆయన కొనియాడారు. దీనితో తెలుగుదేశం కార్యకర్తలు కూడా కేటిఆర్ కి అభిమానులు అయ్యారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వచ్చి చూద్దాం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణా భవన్ లో ఒక సమావేశం జరిగింది. పలు జిల్లాల నుంచి నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో మాట్లాడిన కేటిఆర్, కాంగ్రెస్ సుధీర్గ చరిత్ర ఉన్న పార్టీ, ఆ పార్టీని మేము తక్కువ అంచనా వేయలేం, మాకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ అన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి అయిన బిజెపి గురించి మాట్లాడుతూ, నా చిన్నప్పటి నుంచి బిజెపి అలాగే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఇగో మీద కొట్టారు కేటిఆర్. విమర్శ చేసినా సరే అందంగా చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు కేటిఆర్ ని విమర్శించలేని పరిస్థితి. ఇదే సమయంలో తాను రేపు సిఎం అయినా సరే కాంగ్రెస్ నుంచి విమర్శలు రాకుండా ఉండటానికి కూడా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా కేటిఆర్ ని విమర్శించలేకపోతున్నారు. ప్రత్యర్ధులను కేటిఆర్ గౌరవిస్తారు అనే అభిప్రాయం జనాల్లోకి కూడా బాగానే వెళ్ళింది.

Read more RELATED
Recommended to you

Latest news