ఏపీ హైకోర్ట్ పై మరో వైసీపీ నేత విమర్శలు

-

ఏపి హైకోర్టు తీరును తప్పుబట్టిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్… తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పరిపాలన వ్యవస్థ లో న్యాయ వ్యవస్థ జోక్యం మంచిది కాదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటి పరిధిలో పని చేసుకుంటే మంచిదని సూచించారు. కోర్టులు న్యాయ వ్యవస్థ ను వదిలేసి ప్రజా పరిపాలన లో జోక్యం చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. హైకోర్టు రాజ్యంగం, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆశయాలకు విరుద్దంగా పని చేస్తున్నాయని అన్నారు.

ఏపి హైకోర్టు పరిధి దాటి పని చేస్తూ రాజ్యాంగానికి తిలోధాకులిస్తుందని మండిపడ్డారు. కోర్టులు సహానాన్ని కోల్పోతున్నాయని ఆయన ఆరోపించారు. కోర్టులే సహానాన్ని కోల్పోతే ఇక ప్రజాస్వామ్య వ్యవస్దలపై నమ్మకం ఎలా ఉంటుందని అన్నారు. సామాన్య మానవుడు గురించి, మానవ హక్కుల గురించి హైకోర్టులు ఎక్కడా పట్టించుకోవడం లేదని,

న్యాయ వ్యవస్థ ను వదిలేసి మేమే పరిపాలన చేస్తామనడం రాజ్యాంగ గందరగోళం ఏర్పడుతుందని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా ఏపి హైకోర్టు తీరు చూస్తుంటే బాదేస్తుందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. నిత్య పరిపాలన లో కోర్టులు జోక్యం చేసుకుంటే ప్రభుత్వాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కోర్టులు జోక్యం చేసుకోని అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు. ప్రజాప్రతినిదులు వ్యక్తిగత అంశాలలో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటాన్నాయని విమర్శించారు. ఏపిలో రాజ్యంగాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసనీ ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news