చతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకున్న స్వరూపానంద స్వామిని, స్వాత్మా నంద స్వామిని మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చామని ఏపీ మంత్రి రంగనాథ రాజు అన్నారు. ముఖ్యమంత్రికి, ప్రధాని కి మతాలను అపాదించ కూడదని ఆయన సూచించారు. కొంత మంది కుట్రలు చేశారు ఆకతాయిలు వాటిని కోనసాగించారని అన్నారు. పోలీసులు, సీబీఐ వాటిని విచారించి నిజాలు బయట పెడతాయని మంత్రి పేర్కొన్నారు.
రాళ్లను, రధాలను పూజించే సంస్కృతి హిందువులదని మంత్రి పేర్కొన్నారు. అంతర్వేది ఉత్సవాలు నాటికి రధం పూర్తి అవుతుందని స్పష్టం చేసారు. కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చేసిన గుళ్ళ గురించి ఏ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు…? అని నిలదీశారు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, కోర్టు లో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.