జగన్ సతమవుతున్నా వీళ్ళు పట్టించుకోరా…?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కొంత మంది మంత్రుల నుంచి సహకారం అందడం లేదు .అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఆర్డినెన్స్ దిశగా కూడా సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి సీనియర్ మంత్రుల నుంచి ప్రోత్సాహం లేదు. దీని కారణంగా జగన్ ఇబ్బంది పడుతున్నారు.

బడ్జెట్లో కొన్ని శాఖల కేటాయింపులకు సంబంధించి జగన్ తర్జనభర్జన పడుతున్నారు. కొంతమంది సీనియర్ మంత్రులు వద్ద నుంచి సహకారం రాకపోవడంతో జగన్ సలహాదారులు మీద ఆధారపడాల్సి వస్తుంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి కూడా ఇప్పుడు మంత్రుల నుంచి సహకారం అందడం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఇబ్బంది పడుతుంది.

ఈ తరుణంలో సమస్యలు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి జగన్ కు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. కానీ ఎమ్మెల్యేల నుంచి సీనియర్ మంత్రుల నుంచి అలాంటి పరిస్థితి కనబడటం లేదు. ఇక సలహాదారులు కూడా పెద్దగా జగన్ కోసం సహకరించే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్రానికి చాలా కీలకం. ప్రస్తుతానికి అప్పులు కూడా రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి బడ్జెట్లో కేటాయింపులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మెరుగు పరిచే విధంగా చూడాలి.