ప్రముఖ పారిశ్రామిక వేత్త అనీల్ అంబాని ఏపీ సిఎం వైఎస్ జగన్ ని కలవడం ఇప్పుడు దుమారం రేపుతుంది. ఒక పక్క రాజకీయంగా రాజధాని అంశం దుమారం రేపుతున్న తరుణంలో విజయవాడ లో ల్యాండ్ అయిన అంబాని తాడేపల్లి వెళ్లి సిఎం జగన్ కలిసి చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు జరిగింది ఈ సమావేశం. ఈ సమావేశంలో పెట్టుబడుల గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని మీడియా అంటుంది.
విపక్ష టీడీపీ తో పాటుగా సోషల్ మీడియా ఏమంటుంది అంటే… పరిమల్ నత్వాని అనే రాజ్యసభ ఎంపీ కోసం ఆయన ముంబై నుంచి వచ్చారని, అంబాని వారి కుటుంబానికి ఎంతో అవసరమైన వ్యక్తి అంటుంది. నత్వాని ఝార్ఖండ్ నుంచి రెండు సార్లు రాజ్యసభకు వెళ్ళారని, ఇప్పుడు ఆయన మళ్ళీ రాజ్యసభకు వెళ్ళే అవసరం ఉందని, బిజెపి బలాబలాలు ఆయన్ను రాజ్యసభకు పంపించలేవు కాబట్టి ఏపీ నుంచి జగన్ ద్వారా పంపాలని చూసారు అంటుంది.
దానితో పాటుగా మరో కామెంట్ వినపడుతుంది. గతంలో అంబానియే వైఎస్ ని చంపారు అని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆ అంబానిని మళ్ళీ కలవడం ఏంటీ అంటుంది. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి అంబాని అడిగిన వారికి రాజ్యసభ ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన పెట్టే పెట్టుబడులకంటే… రాజ్యసభ వార్తలే అధికంగా వచ్చాయి. మరి రాజ్యసభకు వచ్చారా పెట్టుబడుల కోసం వచ్చారా అనేది వైసీపీ పెద్దలే చెప్పుకోవాలి.