బ్రేకింగ్:రాజ్యాంగ వ్యవస్థలను తిడుతూ బెజవాడలో వైసీపీ ఫ్లెక్సీలు…!

బెజవాడ వారధి వద్ద వైసీపీ ప్లెక్సీలు కలకలం సృష్టించాయి. రాజ్యాంగ వ్యస్థల పేరుతో ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే చూస్తూరుకునేది లేదు అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేసారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. మరోసారి బహిర్గతంగా రాజ్యాంగ వ్యస్థలను టార్గెట్ చేసారు. ఇప్పటికే హైకోర్టుపై, న్యాయమూర్తుల తీర్పులను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు వైసీపీ నేతలు.

దీనిపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పుటికె మంత్రులు కొందరు, వైసీపీ ఎంపీలు కొందరు పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేయడంపై కేంద్రం ఆగ్రహంగా ఉందనే కథనాలు చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ ఫ్లెక్సీలు ఏ విధంగా మలుపు తిప్పుతాయో చూడాలి.