రిక్షా వాలా చూసిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఏం చేసారంటే…!

-

అసలే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దానికి తోడు కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని అరికట్టేందుకు ప్రజలు, ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కడ చూసినా లాక్ డౌన్ కారణంగా నిరాశ్రయులు ఆహారం లేక అలమటిస్తున్నారు. ఈ సమయంలో తమవంతు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ ఒక రిక్షా కార్మికునీ చూసి చలించిపోయారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేస్తున్న సమయంలో, కరోనా నేపథ్యంలో ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ మైక్ ఉన్న రిక్షాను అతడు లాక్కురావడం చూసిన ఎమ్మెల్యే విడదల రజనీ చలించిపోయారు. రిక్షాను కష్టంగా తోసుకుంటూ వ‌స్తున్న అతని పరిస్తితి చూసిన ఎమ్మెల్యే రజిని ఈ వయసులో ఎందుకు ఇంత కష్ట పడుతున్నావు అని అడగగా,

నేను కష్టపడితే తప్ప కడుపు నిండదని ఆ రిక్షా వ్యక్తి చెప్పాడు. అతను చెప్పిన సమాధానం విన్న ఎమ్మెల్యే పెద్ద మనసుతో అతనికి కొంత డబ్బు, నిత్యావసరాలు ఇచ్చి ఎమ్మెల్యే విడదల రజినీ లాక్ డౌన్ ఎత్తివేసే వరకు బయటకు రావొద్దని, కరోనా ప్రభావం పెద్దవాళ్లపైనే ఎక్కువగా ఉంటుందని ఇంట్లోనే ఉండాలని ఆమె అతనికి చెప్పారు. ఆ రిక్షా కార్మికుడు ఎమ్మెల్యే విడదల రజనీ కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news