భువనేశ్వరి-బ్రాహ్మణి మందు తాగి…వైసీపీని ముంచడానికే!

-

రాజకీయాల్లో విమర్శలు అనేవి నిర్మాణాత్మకంగా ఉండాలి…ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు…ఎవరైనా నాయకులు అక్రమాలు, అవినీతి చేస్తే ప్రశ్నించవచ్చు..కానీ నేతల కుటుంబాలని బయటకు లాగి వారిపై విమర్శలు చేయడం ఏ మాత్రం సహేతుకం కాదు. ఇలా చేయడం వల్ల విమర్శలు ఎదురుకున్న వారికి ఏం కాదు…విమర్శించిన వారికే నష్టం జరుగుతుంది.

అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసుకోవడం కామన్ అయిపోయింది…ఇటు వైసీపీ నేతలు…చంద్రబాబుని, అటు టీడీపీ నేతలు…జగన్‌ని వ్యక్తిగతంగా విమర్శించడం జరుగుతున్నాయి. కానీ ఒకోసారి వైసీపీ నేతలు అధికారంలో ఉండటం వల్ల అనుకుంటా మరీ హద్దులు దాటి విమర్శలకు దిగుతున్నట్లు కనబడుతోంది. ఆ మధ్య చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్ గా  కొందరు వైసీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో తెలిసిందే. దీనిపై చంద్రబాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు.

ఈ విషయంలో వైసీపీకే మైనస్ అయింది…ఇక తాజాగా వైసీపీ మహిళా నేతలు…భువనేశ్వరి-బ్రాహ్మణి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు-లోకేష్‌లని విమర్శిస్తే ఇబ్బంది ఉండదు…కానీ రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరి,  బ్రాహ్మణిలపై విరుచుకుపడ్డారు. అది కూడా దారుణమైన విమర్శలు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.

మద్యపాన నిషేధం అని చెప్పి…మద్యం షాపులని ప్రభుత్వం నడుపుతూ..భారీ రేట్లకు నాసిరకమైన మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవమైన విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రతిపక్ష టీడీపీ సైతం..ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంలో భాగంగా తాజాగా వైసీపీ మహిళా నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు.

మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పి.అమ్మాజీలు తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఇప్పుడున్న మద్యం బ్రాండ్లు టీడీపీ హయాంలో వచ్చినవని, వాటి పర్మిషన్ చంద్రబాబు తీసుకున్నారని అన్నారు.

ఈ క్రమంలోనే వరుదు కల్యాణి మాట్లాడుతూ..చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భువనేశ్వరి.. వేల కోట్లు ఆర్జించారని, మద్యం కంపెనీలన్నీ టీడీపీ వారివే అని అన్నారు. మద్యం సేవించటంలో స్వయంగా అత్తా కోడళ్లు పోటీ పడతారని.. ఇలా తాగి ఇటీవల కొట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయని,  టోటల్‌గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ అని వ్యాఖ్యానించారు. వైఎస్ భారతి గురించి మాట్లాడితే నాలుక కోస్తామని అన్నారు.

అటు పోతుల సునీత మాట్లాడుతూ… మద్యం చుక్క లేకపోతే చంద్రబాబు, లోకేష్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేరని, లోకేష్‌కు మందు, మగువ లేనిదే నిద్రపట్టదని మాట్లాడారు. సరే మద్యం విషయంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుస్. ఒకవేళ చంద్రబాబు మద్యంలో అక్రమాలు చేస్తే..ఇప్పుడు జగన్ ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చు. అలాగే మద్యం బ్రాండ్లకు పర్మిషన్ తీసుకుంటే వాటిని క్యాన్సిల్ చేసి…మంచి బ్రాండ్లని తీసుకు రావచ్చు.

అలా చేయకుండా చంద్రబాబు ఫ్యామిలీపై దారుణమైన విమర్శలు చేయడం, భువనేశ్వరి, బ్రాహ్మణి తాగి కొట్టుకున్నారని మాట్లాడటం వల్ల…ప్రజలు నమ్మడం పక్కన పెడితే…ఇలా మాట్లాడటం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది. రాను రాను ప్రజలు అసహ్యించుకునే పరిస్తితి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా సరే నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే చేసుకుంటే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news