పల్లెకి పోదాం.. వైసీపీని గెలిపిస్తుందా?

-

ఎన్నికల దగ్గర పడుతుండటంతో వైసిపి ఈసారి కూడా గెలిచి అధికారాన్ని చేపట్టాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.  టిడిపి, జనసేన పొత్తు  ఓట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అని రాజకీయ వర్గాల అంచనా. పవన్ పొత్తు విషయం ప్రకటించినప్పుడు వైసీపీ నాయకులు మాకు నష్టమేమీ లేదు అని కామెంట్ చేశారు, కానీ  తర్వాత వారు ఆలోచనలో పడ్డారు.

తాము ఖచ్చితంగా గెలవాలని వైసిపి అధినేత నిర్ణయించినట్లు, దానికోసం ఐ ప్యాక్  తో కలిసి కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇప్పుడు కొత్తగా వైసిపి ప్రభుత్వం “పల్లెకి పోదాం” కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కీలకమైన పల్లె ఓటర్లను ప్రభావితం చేసి తన పార్టీ వైపుకు మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి కి  ఐ ప్యాక్ ఈ కార్యక్రమాన్ని సూచించారు అంటున్నారు. పల్లెకి పోదాం గురించి జగన్, సజ్జల, విజయసాయిరెడ్డి ఇలా ముఖ్య నాయకులందరూ చర్చించుకున్నారు. వినాయక చవితి తర్వాత మంత్రివర్గంతోను, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి నేతలతో కూడా సమావేశమై ఈ కార్యక్రమం గురించి  చర్చించాలి అనుకుంటున్నట్లు  తెలుస్తోంది.

ఈ పల్లెకి పోదాం కార్యక్రమానికి మండల స్థాయి నేతలు ఆధారమని వైసిపి అంటుంది. వైసిపి మండల స్థాయిలోనూ, గ్రామస్థాయిలో ఉన్న వర్గ విభేదాలను దూరం చేయడానికి ఈ పల్లెకి పోదాంని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నారు. పల్లెకి పోదాం లో మండల స్థాయిలోని  నాయకుడు రోజు మండలంలోని ఒక సచివాలయాన్ని సందర్శించి అక్కడ సంక్షేమ పథకాలు జాబితాను పరిశీలించి రాని వాళ్ళు వివరాలు సేకరించి వారికి వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి,పథకాలు వచ్చిన  వారికి జరిగిన లాభాన్ని వివరించి ఈసారి కూడా తమ పార్టీ కే ఓటు వేయాలి అని ప్రచారం చేయాలి.

గ్రామస్థాయిలో ఉన్న వర్గ విభేదాలను దూరం చేయడానికి  గ్రామంలోని వైసీపీ నేతలు అందరికీ విందును కూడా ఏర్పాటు చేయాలనీ ,ఆ విధంగా వైసీపీలో ఉన్న వర్గ పోరు దూరం చేసి ప్రజలలోకి వైసిపి అందించిన సంక్షేమ పథకాలను తీసుకువెళ్లి, టిడిపి, జనసేన పొత్తుకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తోంది.

మరి ఈ వ్యూహం టిడిపి, జనసేన పొత్తును చిత్తు చేసి వైసిపికి విజయం అందిస్తుందా?అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news