తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద అకస్మాత్తుగా ఇద్దరు యువకులు మెరుపు నిరసనకు దిగారు. ప్రగతిభవన్ ఎగ్జిట్ వైపు బైక్‌పై వెళ్లిన యువకులు.. ‘‘ సీఎం కేసీఆర్ ఎక్కడ? ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ అంటూ ఇంగ్లీష్‌లో ప్లకార్డు ప్రదర్శించారు. ఈ ఘటన మెరుపు వేగంతో జరగడం వల్ల పోలీసులు ఆ యువకులను పట్టుకోలేకపోయారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ కనీసం వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షలు కూడా నిర్వహించలేదు కేసీఆర్.
కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్లిపోయారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఆరోగ్యం మీద ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని, కేసీఆర్ గురించి చెప్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.