అనంతపురం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని ఉద్దేశించి మందడంలో తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రసంగించారు. తన నియోజకవర్గానికి మరియు ఇతర ప్రాంతాలను ఉద్దేశించి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మనమే కాదు చాలాచోట్ల వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల బాధపడుతున్నారని దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నామంటూ విమర్శనాత్మకమైన కామెంట్లు చేశారు.
అంతేకాకుండా జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే విశాఖకు రాజధానిని తీసుకు పోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి సంబంధించి రాజధాని అంటే వైఎస్ జగన్ అభిప్రాయం మాత్రమే కాకుండా అందరి నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒక వ్యక్తి కులంపై ద్వేషంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదు. జగన్ సీఎం అయ్యాక దిల్లీ, విశాఖకు ఏడు నెలలుగా కాళ్లు కింద పెట్టకుండా విజయసాయిరెడ్డి తిరిగారు. ఇవాళ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. రేపు భారతి ముఖ్యమంత్రి కావొచ్చు.
ఆమె సీఎం అయ్యాక మళ్లీ ఈ ఒప్పందం చెల్లదంటే కుదురుతుందా? ప్రజల నమ్మకాన్ని జగన్ కోల్పోయారు. రాజధాని సమస్య అనేది 29 గ్రామాలకే కాదు.. మొత్తం రాష్ట్రానికిది. అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఒక వార్త పత్రికలో న్యూస్ వచ్చింది.