ఏపీ యువ‌త‌కు జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌

2621

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జ‌గ‌న్ పాల‌న‌లో త‌న‌దైన ముద్ర‌వేస్తున్నారు. ముఖ్యంగా యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌ను మెరుగుప‌రుస్తూ .. వారి క‌ల‌ల్ని నిజం చేసే దిశ‌గా వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే గ్రామ స‌చివాల‌యాలు, వార్డు స‌చివాల‌యాల పేరుతో సుమారు ల‌క్షా 33వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్ర‌క్రియ వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. తాజాగా.. నిరుద్యోగ యువ‌త‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో శుభ‌వార్త చెబుతోంది. మ‌ద్యం దుకాణాల్లో ఉద్యోగాలు క‌ల్పించే దిశ‌గా అడుగులు వేస్తోంది.

ys jagan Good News For unemployed
ys jagan Good News For unemployed

వ‌చ్చే అక్టోబ‌ర్ నుంచి ఏపీలో కొత్త మ‌ద్యం పాల‌సీ అమ‌లులోకి రాబోతోంది. దీని ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న షాపుల లైలెన్స్‌ల‌ను రెన్యూవ‌ల్ చేయ‌దు.. ప్రభుత్వ‌మే షాపులు నిర్వ‌హించ‌నుంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం కూడా తీసుకుంది. ఈ రిటైల్‌ షాపుల‌ను ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ నిర్వ‌హించ‌నుంది. సుమారు 3,500 దుకాణాలను నిర్వహిస్తుంది. ప్రతి మద్యం దుకాణంలోనూ సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌, వాచ్‌ అండ్‌ వార్డు అనే మూడు విభాగాల సిబ్బంది ఉండ‌నున్నారు. సూపర్‌వైజర్‌కు రూ.17,500, సేల్స్‌మెన్‌కు రూ.15,000 వేతనం చెల్లిస్తారు. సూపర్‌వైజర్‌ పోస్టులకు డిగ్రీ, సేల్స్‌మెన్లకు ఇంటర్‌ విద్యార్హత.

అయితే.. ఈ ఉద్యోగాల కాల‌ప‌రిమితి కేవ‌లం ఏడాది మాత్ర‌మే. అయితే.. ఇక్క‌డ ఒక అవ‌కాశం ఉంది.. అదేమిటంటే.. సంతృప్తికరంగా పనిచేస్తే.. రెండో ఏడాది వీరిని కొనసాగించి ఓ నెల వేతనాన్ని బోనస్‌గా ఇస్తారట. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. వీరు డోర్ డెలివ‌రీ చేయ‌రు.. ఆ షాపులోనే ఉంది మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌ట్టాలి. ఇక వీరి విధుల‌కు సంబంధించి కూడా ప్ర‌భుత్వం చాలా క్లారిటీగానే ఉంద‌ని చెప్పాలి. సాధార‌ణంగా 8 గంటలు ప‌ని దినం ఉంటుంది. కానీ.. ఇక్క‌డ 11 గంటలు పని చేయాలి. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ డ్యూడీ చేయాలి.

మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో.. వారాంతపు సెలవు అడ్జస్ట్ చేసుకోవాలి. మద్యం కొన్నవారికి తప్పని సరిగా.. బిల్లులు ఇవ్వాల్సిందే మ‌రి. అలాగే.. సూపర్ వైజర్లుగా.. పని చేసే వారు బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు.. పర్మినెంట్ చేయమని అసలు డిమాండ్ చేయకూడదు. ఈ విష‌యం ఒప్పంద ప‌త్రంలోనే ఉంటుంద‌ట‌. అయితే.. ఎక్క‌డ కూడా యువ‌త‌ను భ్ర‌మ‌ల‌కు గురిచేయ‌కుండా.. వాస్త‌విక‌త‌ను వారికి వివ‌రిస్తూ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌రించ‌డంపై ప్ర‌జ‌ల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.