ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరిని ఆలోచనలో పడేస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గాని మరో పక్క ప్రజలకు సంక్షేమ పథకాలు ఆపటం లేదు. ఆర్థికంగా రాష్ట్రం అనేక ఇబ్బందులలో ఉన్న గాని సామాన్య ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనాలను రెండు విడతల్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వంటి విషయాలను ఉద్యోగ సంఘాలకు వివరించి వాయిదా పద్ధతిలో జీతాలు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు.ఇదే టైమ్ లో విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడకుండా తాజాగా ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి రెండు వేల కోట్లను జగన్ విడుదల చేశారు. ఏమాత్రం ఫీజు భారం విద్యార్థుల తల్లిదండ్రుల పై పడకుండా పేద విద్యార్థులకు అండగా నిలబడ్డారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి దాదాపు పదిహేను వందల కోట్లను జగన్ ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది.
దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు పదివేల రూపాయలు అడ్వాన్స్ కింద త్వరలో జగన్ ప్రభుత్వం ఇవ్వనుంది. అంతేకాకుండా దేవాలయాల్లో అర్చకులు గా పనిచేసే వారికి కరోనా వైరస్ వల్ల అనేక కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదివేల రూపాయలు జగన్ ప్రభుత్వం ఇవ్వటానికి రెడీ అయింది. ఏదిఏమైనా కరోనా వైరస్ వచ్చినా గానీ తాను ప్రజలకు ఇచ్చిన మాట తప్పి పోకుండా అమలు చేస్తూ పర్ఫెక్ట్ లీడర్ అనిపించుకుంటున్నారు జగన్.