పెట్టుబ‌డుల‌పై జ‌గ‌న్ దిమ్మ‌తిరిగే వ్యూహం… ఏపీకి కంపెనీలు ప‌రుగులే…!

-

ఏపీకి పెట్టుబ‌డులు రావ‌డం లేదు-ఏపీలో ఏ ఒక్క‌రూ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డంలేదు-ఏపీలో ఉన్న సం స్థ‌లే ప‌క్క‌చూపులు చూస్తున్నాయి-ఏపీలో పెట్ట‌బడులు పెట్టేందుకు పెద్ద‌గా ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేదు-ఇ లా అయితే, ఏపీ ఎలా డెవ‌ల‌ప్ అవుతుంది ? ఇప్ప‌టి వ‌ర‌కు వినిపించిన వినిపిస్తున్న వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు ఇవే! ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి కొన్ని మీడియా సంస్థ‌ల వ‌ర‌కు కూడా ఇదే పాట పాడుతున్నాయి. ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డిన జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల బాణాల‌ను సంధిస్తున్నాయి. ప్ర‌బుత్వం ఏర్ప‌డి 10 మాసాలే అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది చాలా ఎక్కువ‌గానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో కూడా ఈ వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయ‌ని అను కోవాలి.

ఈ నేప‌థ్యంలో తాజాగా పెట్ట‌బడులు, ప‌రిశ్ర‌మ‌ల‌పై దృష్టి పెట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ లు చేసిన వారి నోటికి, రాసిన క‌లాల‌కు కూడా తాళాలు వేసేలా అంద‌రికీదిమ్మ‌తిరిగిపోయేలా చ‌ర్య‌లు ప్రా రంభించింద‌ని తెలిసింది. ఈ క్ర‌మంలోనే పారిశ్రామ‌క ప్రోత్సాహకం-ఎగుమ‌తి విధానం-2020-25 ముసాయి దాపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టి పెట్టంది. త‌ద్వారా ఏపీకి పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆక‌ర్షించ డంతోపాటు.. ఎగు మతుల‌పై కూడా దృష్టి పెట్ట‌డం ద్వారా. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని సైతం త‌గ్గించేందుకు కృషి చేయాల‌ని యోచిస్తోంది. ముఖ్యంగా ఈ విధానంలో రెండు కీల‌క విష‌యాలు ఉన్నాయి.

ఒక‌టి.. పారిశ్రామిక రాయితీల‌ను భారీగా పెంచ‌డం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఏ పారిశ్రామిక సంస్థ అయినా త‌మ సంస్థ‌ను ఏర్పాటు చేస్తే.. 2431 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కువివిధ రూపాల్లో రాయితీలు ఇస్తున్నారు. దీనిని ఇక నుంచి అంటే 2020-25 ముసాయిదాలో 4638 కోట్ల రూపాయ‌ల‌కు పెంచాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తోంది. అదేస‌మ‌యంలో రెండో విదానం ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే ఇవ్వాలి. అయితే, ఇది పారిశ్రామిక వేత్త‌ల‌కు ఇబ్బందిగా మారింద‌ని గుర్తించిన ప్ర‌భుత్వం ఈవిధానాన్ని కొన‌సాగిస్తూ.. తొలి రెండేళ్ల‌పాటు ఉద్యోగుల‌కు రూ.3 వేల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వమే ఇన్‌సెంటివ్ రూపంలో ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది. అంటే ప‌రిశ్ర‌మ‌ల‌పై ఆర్థిక భారం త‌గ్గుతుంది.

అదేవిధంగా వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని కూడాజ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది. అగ్రిటెక్‌, ఆహార శుద్ది, అదేవిధంగా ఏరో స్పేస్‌, డిఫెన్స్, ఔష‌ధ‌రంగం, టెక్స్‌టైల్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఆటో మొబైల్ ప‌రిక‌రాల ఉత్ప‌త్తికి ప్రాధాన్యం ఇవ్వ‌నుంది. ఈ ప‌రిణామంతో ఏపీ లో పెట్టుబడుల‌కు మంచి ఊపు వ‌స్తుంద‌ని అంటున్నారు పారిశ్రామిక వ‌ర్గాల‌కు చెందిన నిపుణులు మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. నిజానికి ఈ రాయితీలు.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన దానిక‌న్నా డ‌బుల్ కావ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news