బాబు కోరుకున్న‌దే జ‌గ‌న్ చేస్తున్నారు.. మ‌రి బాబు ఏం చేస్తారు…?

సాధార‌ణంగా అధికారంలో ఉన్న నాయ‌కులు విప‌క్ష నాయ‌కులు కోరుకున్న విధంగా ఏ కార్య‌క్ర‌మాన్నీ నిర్వ హించ‌రు. ఇక‌, విప‌క్షంలో ఉన్న వారు స‌హ‌జంగానే అధికారంలో ఉన్న నాయ‌కులు చేయ‌లేని, చేయ‌రాని ప‌నుల‌నే చేయాల‌ని కోరుకుంటారు. ఇలా ఉత్త‌ర-ద‌క్షిణ ద్రువాల మాదిరిగా అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఉంటాయ నేది అంద‌రికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు గ‌తానికి భిన్నంగా ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు నాయుడు కోరుకున్న అంశాన్నే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌ని, అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక విష‌యాల్లో జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన చంద్ర‌బాబు ఈ విష‌యంలో అయినా స‌హ‌క‌రిస్తారా? లేదా? చూడాలి! స‌రే! ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేయ‌డం, అభ్య‌ర్థులు. . డ‌బ్బులు, మ‌ద్యం స‌హా ఇత‌ర గిఫ్టులు అందించ‌డం అనేది చాలా విచ్చ‌ల‌విడి వ్య‌వ‌హారంగా మారిపో యింది. ఒక వైపు మేనిఫెస్టోలో అనేక అంశాలు, హామీలు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు తాయిలాయిలాలు పంచి తేనే త‌ప్ప వారు ఓటేస్తారో లేదో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది.

ఈ క్ర‌మంలోనే అన్ని పార్టీల‌కూ కూడా ఎన్ని క‌లు అన‌గానే అమ్మో!! అనే మాట వినిపిస్తుంటుంది. పోనీ.. ఇంత ఖ‌ర్చు పెట్టినా.. ప్ర‌జ‌లు త‌మ‌కే ఓటేశా రో.. లేదో అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవ‌ల ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే ప్ర‌స్తావించి న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌జ‌లుఅప్ప‌డప్పుడు(అంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో) త‌ప్పులు చేస్తుంటార‌ని, వెయ్యికి, రెండు వేల‌కు కూ డా ఓటును అమ్ముకుంటార‌ని దీనివ‌ల్ల చెడు జ‌రుగుతోంద‌ని అన్నారు. పైకి ఆయ‌న వ్యూహం వైసీపీని ప్ర జ‌లు గెలిపించార‌నే అక్క‌సుతోనే అయి ఉండొచ్చు. కానీ, ఎన్నిక‌ల డ‌బ్బు పంపిణీ అనేది కామ‌న్ స‌బ్జెక్టుగా తీసుకుంటే.. బాబు వ్యాఖ్య‌లు ఆలోచింప‌జేసేవే.

నిజానికి ఇదే విష‌యంపై కొన్నాళ్ల కింద‌ట టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీకి అడ్డు క‌ట్ట వేసేందుకు తాను ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు. క‌ట్ చేస్తే.. ఈ ప్ర‌య‌త్నం ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వైపు నుంచే జ‌రుగు తుండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మ‌ద్యం పంపిణీ, ప్ర‌లోభాల‌కు ప్ర‌జ‌ల‌ను దూరంగా ఉంచాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. మ‌రి ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఈ ఒక్క విష‌యంలోనైనా.. జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించి త‌న పెద్దరికం నిలుపుకొంటారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది.