ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రం మొత్తం బీరువాలో ఒదిగిన పట్టు వస్త్రంగా మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే నే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. అదేసమయంలో ప్రభుత్వం కూడా మూడు జిల్లాలు కృష్ణా, విశాఖ, ప్రకాశంలలో నిర్బంధ కర్ఫ్యూనైనా అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికిప్పుడు అంత దూరం వెళ్లకుండా ప్రస్తుతానికి 144 సెక్షన్ విధించింది. ఎవరూ గుమి గూడి ఉండొద్దని కూడా ప్రబుత్వం సూచించింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. అసెంబ్లీ సమావేశాల విషయంలో మాత్రం ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరి స్తోంది. మార్చి 31తో ప్రస్తుతం జరుగుతున్న 2019-20 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో కొత్తగా బడ్జె ట్ను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగే ప్రక్రియే. నిజానికి ఇప్పుడు దేశంలో కరోనా ఎఫెక్ట్ లేకపోయి ఉంటే.. అన్ని రాష్ట్రాల్లోనూ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండేవి. అయితే, కరోనా కారణంగా జనజీవనానికే ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఎవరూ బయటకు రాని పరిస్థితి నెలకొంది. అయితే, బడ్జెట్ సమావేశాలు నిర్వహించకపోతే.. ప్రబుత్వానికి నిధులు ఖర్చు చేసే వెసులు బాటు పూర్తిగా ఉండేఅవకాశం లేదు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ బడ్జెట్ సమావేశాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రజలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాల అమలు వంటివి చేసేందుకు నిధుల కొరత లేకుండా చేసుకునేందుకు, ప్రభుత్వానికి వెసులు బాటు కల్పించుకునేందుకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు మొగ్గు చూశారు. ఈ క్రమంలోనే ఈనెల 29, 30 , 31 తేదీల్లో రెండు రోజులు ఈ సమావేశాలు జరుగుతాయని అసెంబ్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే, ఈ మూడు రోజుల్లోనూ రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే సమావేశాలు నిర్వహించడంతోపాటు అత్యంత తక్కువ సమయంలోనే ముగించాలని నిర్ణయించారు.