ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు వైకాపాకే పట్టం కట్టనున్నారట. అలాగే వైకాపా అధికారంలోకి వచ్చాక జగనే సీఎం అవుతారని కూడా సర్వేలో తేలింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ టీడీపీ నుంచి వైకాపాలోకి ఇటీవలి కాలంలో చేరికలు ఎక్కువయ్యాయి. అయితే ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరుగాంచిన పలు ప్రముఖ సర్వే సంస్థలు సర్వే చేయగా.. ఏపీకి తదుపరి సీఎం జగనే అని రిజల్ట్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరొక ప్రముఖ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలోనూ ఏపీ ప్రజలు జగన్‌నే సీఎంగా కోరుకుంటున్నారని ఫలితం వచ్చింది.
ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నాడిని తెలుసుకునేందుకు తాజాగా సర్వే చేసింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఓటర్లకు పలు ప్రశ్నలు వేసి రాబట్టింది. అనంతరం ఫలితాలను వెల్లడించింది. వాటి ప్రకారం.. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు వైకాపాకే పట్టం కట్టనున్నారట. అలాగే వైకాపా అధికారంలోకి వచ్చాక జగనే సీఎం అవుతారని కూడా సర్వేలో తేలింది.
ఇక గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో చంద్రబాబు పాలనపై కూడా ఆ సంస్థ సర్వే చేయగా.. అందులో ప్రజలు బాబు పాలన ఏమీ బాగాలేదని, ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో బాబు విఫలం అయ్యారని మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడ్డారు. అలాగే చంద్రబాబు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో సీఎంగా ఏపీకి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందని, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరి అస్పష్టంగా ఉందని, ఏపీని ప్రగతి పథంలో నిలపడంలో బాబు విఫలం అయ్యారని.. సర్వేలో తేలింది. మరి సర్వే సంస్థలన్నీ చెబుతున్న ప్రకారం.. ఏపీకి తదుపరి సీఎం జగనే అవుతారా, లేదా అన్న విషయం తేలాలంటే.. ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడక తప్పదు..!