వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ సోష‌ల్ మీడియా ఎటాక్‌… పోలిస్ కంప్లెంట్‌

-

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ముందు నుంచి గ‌ట్టి పోరాటం చేసిన వారిలో మంగ‌ళ‌గిర వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న స‌దావ‌ర్తి భూముల విష‌యంలోనే కాకుండా రాజ‌ధాని భూముల సేక‌ర‌ణ‌, స‌చివాల‌యం ఇలా ప్ర‌తి అంశంలోనూ ఆర్కే బాబుపై ఎంతో పోరాటం చేశారు. ఇక ఇప్పుడు లోకేష్‌పై గెలిచి ఆర్కే రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.

YSRCP MLA RK Complains To Police Over Threats On Social Media
YSRCP MLA RK Complains To Police Over Threats On Social Media

ఇప్పుడు కూడా ఆళ్ల బాబును అంతే రేంజ్‌లో ఢీకొడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్కేను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ వాళ్లు కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ప్ర‌చారం మితిమీర‌డంతో ఆయ‌న పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న తాడేప‌ల్లి స్టేష‌న్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో త‌న‌పై బెదిరింపు ధోరణితో పోస్టులు పెట్టారు. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేశార‌ని చెప్పారు. త‌న‌ను మంగ‌ళ‌గిరి నుంచి త‌రిమి కొడ‌తామ‌ని కూడా వాళ్లు హెచ్చ‌రిస్తున్నార‌ని ఆర్కే ఫిర్యాదు చేశారు. త‌న‌కు ప్రాణ‌హానీ ఉన్న నేప‌థ్యంలో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కూడా చెప్పారు.

ఇక తాను బాబు నివాసంలోకి వెళ్లాన‌ని టీడీపీ వాళ్లు చేస్తోన్న వాద‌న‌లో కూడా అర్థం లేద‌ని అర్కే ఖండించారు. బాబు అక్ర‌మ నివాసంలో ఉంటున్నార‌ని… తాను ఆయ‌న నివాసంలోకి వెళ్ల‌లేద‌ని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా కూడా టీడీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఇల్లు ముంపునకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఏపీ ప్ర‌జలు ఇచ్చిన తీర్పుతో చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌కు మ‌తిపోయింద‌ని.. అందుకే వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news