గ‌న్న‌వ‌రం నుంచి వంశీ అవుట్‌… వైసీపీ కొత్త గేమ్ ఇదే..!

-

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం వైసీపీ రాజ‌కీయం మ‌రో యూట‌ర్న్ తీసుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ కొద్ది రోజుల‌కే టీడీపీని వీడి వైసీపీ సానుభూతి ప‌రుడిగా మారారు. ఇప్పుడు గ‌న్న‌వ‌రంలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డీసీసీబీ చైర్మ‌న్ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, మ‌రో నేత దుట్టా రామ‌చంద్ర‌రావు వంశీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. వీరికి తోడు వంశీ అంటే ప‌డ‌ని మాజీ ఎమ్మెల్యే దాస‌రి బాల‌వ‌ర్థ‌న్ రావు సైతం వీరికి జ‌త‌క‌లిశారు. దీంతో గ‌న్న‌వ‌రం రాజ‌కీయం రంజుగా మారింది.

వంశీకి తెలివిగా చెక్ పెట్టేందుకు ఈ ముగ్గురు త్ర‌యం నేత‌లు రెడీ అయ్యారు. గ‌న్న‌వ‌రంలో వంశీకి క‌మ్మ వ‌ర్గం యాంటీ అయ్యింద‌ని.. అక్క‌డ ఆయ‌న గెల‌వ‌డ‌ని చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌న్న‌వ‌రం బాధ్య‌త‌లు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుకు అప్ప‌గించి… వంశీని విజ‌య‌వాడ లోక్‌స‌భ‌కు పంపాల‌ని కొత్త ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు తెస్తున్నారు. త‌మ‌ను కాద‌ని వంశీకి గ‌న్న‌వ‌రం ప‌గ్గాలు ఇస్తే గ‌న్న‌వ‌రం సీటును చేజేతులా తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టిన‌ట్టే అవుతుంద‌ని చెపుతున్నారు.

ఈ క్ర‌మంలోనే వంశీని వ్య‌తిరేకిస్తోన్న నేత‌లు అందరూ ఆయ‌న్ను విజ‌య‌వాడ లోక్‌స‌భ‌కు పంపేయాల‌ని సూచిస్తున్నారు. పార్టీ కీల‌క నేత‌లు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంతా అదే ఆలోచనలో ఉన్నారు. అయితే వీరు విజ‌య‌సాయి రెడ్డిని క‌న్విన్స్ చేసే యోచ‌న‌లో ఉన్నారు. ఆయ‌న్ను కూడా ఒప్పించాక వీరంతా ఈ ప్ర‌త‌పాద‌న జ‌గ‌న్ ముందు పెట్టాల‌ని చూస్తున్నారు. జ‌గ‌న్ కూడా దీనికి ఓకే చెపితే గ‌న్న‌వ‌రం నుంచి వంశీ అవుట్ కాక త‌ప్ప‌దు. అదే జ‌రిగితే రాజ‌కీయంగా వంశీ తాను తీసుకున్న గోతిలో తాను ప‌డిన‌ట్టే అవుతుంది.

వంశీకి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గ‌న్న‌వ‌రంలో గెలిచే ప‌రిస్థితి లేదు. తిరిగి ఆయ‌న్ను టీడీపీ వాళ్లు రానివ్వ‌రు.. ఇక ఆయ‌న‌కు ఫైన‌ల్ ఆప్ష‌న్ విజ‌యవాడ ఎంపీ సీటే. అయితే అక్క‌డ కూడా ఆయ‌న‌కు గెలుపు అవ‌కాశాలు క‌ష్ట‌మే అంటున్నారు. ఏదేమైనా వంశీ ఎంత దూకుడుగా వైసీపీలోకి వెళ్లారో అంతే దూకుడుగా బొక్క బోర్లా ప‌డ్డార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Read more RELATED
Recommended to you

Latest news