జగన్ ప్రస్తుతం తాడేపల్లిలోని తన కొత్త ఇంట్లో ఉన్నారు. అక్కడే ఎన్నికల ఫలితాలను తెలుసుకుంటారు. గెలిస్తే అక్కడి నుంచే హైదరాబాద్‌కు సీఎంగా వెళ్తారు. ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఖచ్చితంగా జగన్ గెలుస్తారని తెలియడంతో.. ఆయనను కలవడానికి చాలామంది వైసీపీ నేతలు వస్తున్నారు.
అసలు సమరం ఈరోజు. ఇది అసలు సిసలు కిక్ అంటే. తెలుగు రాష్ర్టాల్లోనే కాదు.. దేశమంతా ఈరోజు కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు. అయితే.. ఫలితాలకు 3 రోజుల ముందు నుంచే ఏపీలో వైఎస్ జగన్‌కు భద్రత పెరిగింది. జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని కేంద్రం హోంశాఖ నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ వెంటనే ఏపీ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు.
జగన్ ప్రస్తుతం తాడేపల్లిలోని తన కొత్త ఇంట్లో ఉన్నారు. అక్కడే ఎన్నికల ఫలితాలను తెలుసుకుంటారు. గెలిస్తే అక్కడి నుంచే హైదరాబాద్‌కు సీఎంగా వెళ్తారు. ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఖచ్చితంగా జగన్ గెలుస్తారని తెలియడంతో.. ఆయనను కలవడానికి చాలామంది వైసీపీ నేతలు వస్తున్నారు. తాడేపల్లి వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. జగన్ ఇంటి వద్ద కూడా సందడి సందడిగా ఉంది. దీంతో జగన్ ఇంటి చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పరచారు.
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు, జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. కాకపోతే.. పోలీసు శాఖ.. జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడంపై ఎక్కడా వెల్లడించలేదు.
జగన్.. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లినప్పుడు.. అక్కడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు కూడా జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. జగన్‌కు ఇప్పటి నుంచే జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారంటే.. జగన్ సీఎం అయిపోతారని.. ముందే తెలిసిపోయిందా? అని అంతా గుసగుసలాడుకుంటున్నారు.