ఎమ్మెల్యే ఆళ్ల కు తప్పిన ప్రమాదం

-

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. ఆయన వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి అని శుక్రవారం తాడేపల్లి మండలం ఉండవల్లికి వెళ్లారు. అయితే ఆ సమయంలో పెళ్లి వేదిక పైకి వెళ్లి వధూ వరులను ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వేదిక కూలిపోయినట్లు తెలుస్తుంది. దీనితో ఈ ఘటనలో ఆర్కే కిందపడడం తో చిన్న గాయం తో బయటపడినట్లు తెలుస్తుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి గ్రామంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి శుక్రవారం రాత్రి పెళ్లి వేడుక కోసం అని వెళ్లారు. అయితే అక్కడ ఎమ్మెల్యే మండపం పైకి ఎక్కినా సమయంలో ఒక్కసారిగా ఆ వేదిక కూలిపోయింది. దీనితో ఈ ఘటనలో ఆళ్ల కుడికాలి పాదానికి గాయమైనట్లు తెలుస్తుంది. దీనితో వెంటనే ఆయన్ను చికిత్స కోసం అని గుంటూరు లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబందించిన మరిన్ని అంశాలు తెలియాల్సి ఉంది. వైసీపీ పార్టీ లో కీలక నేతగా వ్యవహరించే ఆళ్ల కు సీఎం జగన్ మూడు రాజధానులు చేస్తాం అంటూ ప్రకటించినప్పుడు సంకట పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఆళ్ల రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు.

అయితే ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఆర్కే స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ ప్రమాదం గురించి తెలియగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కాస్త కంగారుపడినప్పటికీ అనంతరం అసలు విషయం తెలియడం తో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దీనితో ఆయన్ను పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news