షాకింగ్ నివేదిక: కన్నీళ్ల లో కూడా కరోనా!

-

చైనా లో భారీ స్థాయిలో ప్రబలిన ఈ కరోనా వైరస్ తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి నుంచి ఈ కరోనా అనేది వస్తుందా అని కొన్ని దేశాలు ఈ కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న చైనా,ఇరాన్ ల నుంచి ఎవరినీ కూడా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ కోవిడ్-19 కానీ,మరేదైనా వైరస్ గానీ ఊపిరితిత్తుల ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అందుకే అందరూ మాస్క్ లు ధరించి ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా చైనా లోని జీజియాంగ్ వర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఇప్పటివరకు అందరూ అనుకున్నట్లు ఈ వైరస్ అన్ని వైరస్ లు లాగా ఊపిరితిత్తులతో మాత్రమే వ్యాప్తి చెందదట కన్నీటి చుక్కలు,కండ్ల కలకల్లోనూ ఈ వైరస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్ సోకిన పేషేంట్ల పై అనేక పరీక్షలు జరిపిన తరువాతే ఈ నిర్ధారణ కు వచ్చినట్లు తెలుస్తుంది.

కేవలం ఊపిరితిత్తుల కే కాకుండా,ఇతర శరీర భాగాల నుంచి కూడా ఈ వైరస్ అనేది సోకుతుంది అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మానవ శరీరం నుంచి బయటకు వచ్చే కరోనా వైరస్‌ ఏవైనా వస్తువులపై కూడా సుమారు రెండు నుంచి ఐదు రోజుల వరకు బతికే ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనితో కరోనా సోకకుండా ఉండాలి అంటే కేవలం మాస్క్ లు ధరించడమే కాకుండా కళ్లకు అద్దాలు,అలానే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసువాల్సి ఉంటుంది అన్నమాట. అందుకేనేమో చివరకు చైనా కరెన్సీని సైతం మార్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news