తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వందకు వంద శాతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనపై మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. టీఆర్ఎస్ నాయకులు చేసిది.. రైతు దీక్ష కాదని విమర్శించారు. అదొక దొంగ దీక్ష అంటూ మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. రైతులను ఆయోమయానికి గురి చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రాష్ట్ర రైతులు నష్టపోతారని అన్నారు. కాగ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. సోమవారం ఢిల్లీ లో ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా వెళ్తున్నారు.