AP Cabinet : సినీ న‌టి రోజాకు కేబినెట్ బ‌ర్త్ క‌న్ఫామ్

-

సినీ న‌టి, న‌గ‌రీ ఎమ్మెల్యే రోజాకు ఎట్ట‌కేల‌కు కేబినెట్ బ‌ర్త్ క‌న్ఫామ్ అయింది. తాజా గా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడుద‌ల చేసిన కేబినెట్ మంత్ర‌లు జాబితాలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు కూడా ఉంది. సీనియ‌ర్ హీరోయిన్ రోజా.. గ‌త కేబినెట్ లోనే మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డింది. కానీ ప్ర‌స్తుతం సీఎం వైఎస్ జ‌గ‌న్ చేప‌డుతున్న కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా రోజాకు కేబినెట్ బ‌ర్త్ క‌న్ఫామ్ అయింది.

ఆర్కే రోజా.. తెలుగు తో పాటు ప‌లు భాషాలల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 1999 లో టీడీపీ లో చేరారు. అనంత‌రం రోజా 2011లో వైసీపీ లో చేరారు. 2014, 2019 రెండు ప‌ర్యాయాలు న‌గ‌రి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అంతే కాకుండా వైసీపీ రాష్ట్ర మహిళా చీఫ్ గా పని చేశారు. అలాగే 2019 నుంచి 2021 వ‌ర‌కు ఏపీఐఐసీ చైర్మెన్ గా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇప్పుడు.. మంత్రి ప‌ద‌విని కూడా చేప‌ట్ట‌బోతున్నారు. జ‌గ‌న్ కేబినెట్ లో రోజా తో పాటు వనిత, విడదల రజిని, ఉషశ్రీలకు కూడా మంత్రి పదవులు ద‌క్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news