బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ త్వరలోనే ఓటిటి లొకి..!!

-

తమిళంలో పేరుగాంచిన  ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’. ను సినిమా గా తీసిన విషయం తెలిసిందే.చియాన్ విక్రమ్, కార్తి ,జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ 1 PS-1 తెలుగులో డీసెంట్ వసూళ్లు సాధించింది.

ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఓటిటి లొకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా ప్రేక్షకులకు సినిమా మేకర్స్ శుభ వార్తను తెలియచేసారు. ఈ బిగ్ ఫిల్మ్ PS-1, నవంబర్ 18, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో  ప్రసారం కానుందని  అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి సినిమా యూనిట్ మరియు OTT ప్లాట్‌ఫారమ్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news