ట్రెండ్ ఇన్ : ‘బీస్ట్’ ట్రైలర్‌లో చుక్కలా మెరిసిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ పాత్ర నిడివిపై ఫ్యాన్స్ ఆందోళన..

-

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రతీ విషయం ట్రెండవుతుండటం మనం గమనించొచ్చు. తమ నిరసనను తెలపడానికి సోషల్ మీడియాను కూడా చాలా మంది వేదికగా వాడుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ట్రైలర్ విడుదల చేయాలని కోరుతూ, ఆయన అభిమానులు We Want Beast Trailer అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఈ క్రమంలోనే బీస్ట్ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ అయింది. కాగా, విడుదలైన సదరు ట్రైలర్ లో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నిడివి చాలా తక్కువగా ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే ‘అరబిక్ కుత్తు, రావమ్మా’ సాంగ్స్ లో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో రికార్డు వ్యూస్ వచ్చేలా చేసిందని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన మూడు నిమిషాల ‘బీస్ట్’ ట్రైలర్ లో కొన్ని సెకన్ల పాటే పూజా హెగ్డేను చూపించడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. #PoojaHegde పూజా హెగ్డే హ్యాష్ ట్యాగ్ తో వరుస ట్వీట్స్ చేస్తూ సదరు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. అలా ఆ హ్యాష్ ట్యాగ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.

నిజానికి పూజా హెగ్డే హీరోయిన్ గా పరిచయమైంది తమిళ్ సినిమాతోనే.. కాగా, అటువంటి తమిళ చిత్రంలో పూజా హెగ్డే కు ఇప్పుడు అవమానం జరిగినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డేను తమిళ్ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అలా ఈ సుందరి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇళయ దళపతి విజయ్ ‘బీస్ట్’ చిత్రంలోనైనా తమ హీరోయిన్ కు తగిన ప్రయారిటీ ఇవ్వాలని ఈ సందర్భంగా బుట్టబొమ్మ అభిమానులు అనుకుంటున్నారు. బుట్టబొమ్మ నటించిన ‘బీస్ట్’ ఈ నెల 13న విడుదల కానుండగా, ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ అయిన ఈ భామ‘ఎస్ఎస్ఎంబీ 28’లోనూ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నది. మరో వైపున బాలీవుడ్ ఫిల్మ్ ‘సర్కస్’లోనూ కథానాయికగా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news