ఎమ్మెల్యే రోజాకు పూనమ్ బర్త్ డే విష్…కానీ ఆ యాష్ టాగ్ ఏంటో..?

-

టాలీవుడ్ లో పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్. అయితే పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా పలు వివాదాల తో ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల పాటు ఓ హీరోపై ఆరోపణలు చేసి ఆ తరవాత వేరే వాళ్ళు అలా చెప్పించారని పేర్కొంది. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా లో మాత్రం పూనమ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక పూనమ్ చేసే ట్వీట్ లు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Poonam Kaur birthday wishes to roja
Poonam Kaur birthday wishes to roja

తాజాగా నటి, ఎమ్మెల్యే రోజాకు పుట్టిన రోజు విషెస్ చెప్పిన పూనమ్ కౌర్ ఆసక్తికర యాష్ టాగ్ జొడించింది. పూనమ్ తన ట్వీట్ లో “ఎంతో అందమైన రోజా గారికి పుట్టినోజు శుభాకాంక్షలు. ఆమెను వారి కుటుంబాన్ని దేవుడు దేవించాలి. ఒక మహిళగా ఆమె చేసిన పోరాటాన్ని అభినందించాలి.. అంటూ పేర్కొంది. ఇక ఈ ట్వీట్ కు పూనమ్ “పీకే లవ్” అంటూ యాష్ టాగ్ పెట్టింది. దాంతో ఈ పీకే లవ్ ఏంటో అసలు అర్థం కాదు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news