వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి పూనమ్ కౌర్ ఫైర్ అయ్యారు. ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు.
Plz include a character named #rgv who calls girls finding out their emotional weakness n instigates them to use abusive language and sends tweets to them to share as if they are doing it n then informs media about it …I respected U when I was a child …feel sad about u now https://t.co/XfiE7JOeLF
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 28, 2020
అయితే, ఈ ట్వీట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. వర్మ తన సినిమా గురించి ప్రకటించిన వెంటనే పూనమ్ స్పందించింది. ఈ సినిమాలో ఆర్జీవీ కూడా జత చేయండని కోరింది. అమ్మాయిల బలహీనతలు తెలుసుకుని, వారిని తీవ్ర దూషణలు చేసేలా రెచ్చగొట్టడం, మళ్లీ ట్వీట్ల స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం లాంటివి చేసే వాడి పాత్రను కూడా పెట్టండని తెలిపింది. తాను నిన్న చిన్నతనంలో ఎంతో గౌరవించానని, కానీ ఇప్పుడు ఎంతో బాధగా ఉందని చెప్పుకొచ్చింది.
I really wish I had recorded the call of this traitor director who brainwashed me for an hour to speak against a personality …the tweets he sent me were sent to respective party personal …thank god I have few genuine people in media I wouldn’t know ur intentions otherwise …
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 28, 2020
ఓ డైరెక్టర్ ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలని తన బ్రెయిన్ ను దాదాపు గంటసేపు వాష్ చేశాడని గతంలో జరిగిన విషయాలను తవ్వింది పూనమ్ కౌర్. తనకు ఆ డైరెక్టర్ పంపిన ఆ మెసెజ్ లను సదరు పార్టీ ప్రతినిధులకు పంపానని తెలిపింది. అతని దురద్దేశాన్ని తనకు కొందరు మీడియా వారు తెలియజేశారని, కొందరైనా నిజాయితీ వ్యక్తులు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలను తెలిపింది.
I wish this man really spends time in knowing about #jiahkhans death n reveals the truth about certain part of the industry…I hope u feel for her mother who has been sharing vedios post #SSR death …uWill not be funded for that n it won’t benefit u ..that’s y u won’t make it
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 28, 2020
‘జియా ఖాన్ మరణం వెనుకున్న రహస్యాలు తెలుసుకోవాలి, ఇండస్ట్రీలోని నిజానిజాలు బయట పెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఆమె తల్లి బాధను అర్థం చేసుకున్నారని అనుకుంటాను.. మీకు వారెవ్వరూ ఫండ్ ఇవ్వరు.. మీకు దానితో ఎలాంటి లాభం ఉండదు..కాబట్టి మీరు వారిపై సినిమాలు తీయరు’ అని పూనమ్ కౌర్ చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.