“జై బాలయ్య” అంటూ సాష్టాంగ నమస్కారం చేసిన హీరోయిన్ పూర్ణ

-

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల అఖండ విజయోత్సవ జాతర నిన్న రాత్రి వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అఖండ చిత్ర బృందం మొత్తం హాజరైంది. అయితే ఈ సందర్భంగా… హీరోయిన్ పూర్ణ.. చాలా ఎమోషనల్ అయ్యింది. స్టేజ్ ఎక్కి మైకు పెట్టగానే… జై బాలయ్య అంటూ… అందర్నీ అలరించింది. అఖండ సినిమాలో.. నటించే ఛాన్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది హీరోయిన్ పూర్ణ.

ఇక అనంతరం.. బాలయ్య గురించి కొడుతూ.. స్టేజ్ పైనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది హీరోయిన్ పూర్ణ. బాలయ్య సినిమాలో నటించడం ఒక అదృష్టమని.. అలాంటి నటుడ్ని ఇప్పటివరకు చూడలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ బాలయ్య అఘోర గెటప్ లో తనకు కనిపిస్తూనే ఉంటారు అంటూ కొనియాడింది. బాలయ్య బాబు చాలా స్వీట్ పర్సన్.. అంటూ ప్రశంసలు కురిపించింది ఈ అమ్మడు. అయితే హీరోయిన్ పూర్ణ సాష్టాంగ నమస్కారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news