బిపిన్ రావత్ చివరి కోరిక తీర్చలేకపోయాం… మంచినీరు కావాలని అడిగినా..ఇవ్వలేకపోయాం..- ప్రత్యక్ష సాక్షులు

-

తమిళనాడు నీలగిరి జిల్లాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో దేశ తొలి త్రివిధ దళాల అధిపతి సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈయనతో పాటు ఆయన సతీమణి మధులిక రావత్.. మరో 11 మంది దుర్మరణం చెందడం భారతదేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. భారతావనికి అనేక దశాబ్ధాలుగా సేవలందించించి బిపిన్ రావత్ చివరి కోరికను కూడా తీర్చలేని పరిస్థితిలో మరణించడని తెలిసి చాలా మంది  ప్రజలు బాధపడుతున్నారు. గుక్కెడు మంచినీళ్లు అడిగిన ఇవ్వలేని పరిస్థితుల్లో రావత్ మరణించడం చాలా మందిని కంటతడి పెట్టిస్తోంది.

ప్రమాద సమయంలో తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్ .. తనకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగారని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో సహాయక చర్యలు అందించడానికి వెళ్లిన ప్రత్యక్ష సాక్షి శివకుమార్ బిపిన్ రావత్ చివరి శ్వాస సమయంలో మంచినీరు కావాలని అడిగినట్లు వెల్లడించారు.

హెలికాప్టర్ మంటల్లో చిక్కుకున్న తరువాత సహాయక చర్యల కోసం అక్కడికి వెళ్లామని.. అక్కడ ముగ్గురు పడి ఉన్నారని.. వారిలో ఒకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం చూశామని.. ఆయన తనని తాగడానికి నీళ్లు కావాలని అడిగారని వెల్లడించారు. ఆయనను చికిత్స కోసం తీసుకెళ్లడానికి దుప్పటిపై లాగామని.. ఆ తరువాత కొన్ని గంటల తరువాత ఓ పోలీస్ అధికారి వచ్చి తనకు ఫోటోలు చూపించారని.. నీతో మాట్లాడిన వారు బిపిన్ రావత్ అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. దేశానికి రక్షణగా నిలిచిన ఓ గొప్ప వ్యక్తి తాగడానికి నీరు అందని స్థితిలో ఉండటం చూసి చలించిపోయాను. దాంతో రాత్రంతా నిద్ర పట్టలేదని చెప్పారు ప్రత్యక్ష సాక్షి శివకుమార్. అప్పటికి వారెవరో తెలియదని ఆ తరువాతే ఆయన త్రివిధ దళాల ధళపతి బిపిన్ రావత్ అని తెలిసిందన్నారు. వెంటనే బిపిన్ రావత్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నించారని.. మార్గం మధ్యలోనే బిపిన్ రావత్ మరణించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news