నూతన విధానానికి శ్రీకారం.. కళాకారులకు డైరెక్ట్ అవకాశాలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళాకారులకు ఐడికారులు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టులు ఏ జంతువులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర కళాకారుల డేటాబేస్ తయారు చేస్తాము. అవకాశాలు డైరెక్ట్ గా అందిపుచ్చుకునే అవకాశం వస్తుందని పోసాని వెల్లడించారు.

నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించాము. నాటకాలకు 115 ఉత్తమ పుస్తకాల కేటగిరిలో మూడు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు పోసాని. సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు స్కూటీని జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 19వ తేదీ అవార్డులను ప్రకటించనున్నట్లు తెలిపారు. అవార్డుల ఎంపికలో పూర్తిగా పారదర్శకత పాటిస్తామని స్పష్టం చేశారు పోసాని కృష్ణమురళి. రాష్ట్రంలో ఉన్న కళాకారులకు అండగా ఉంటామని.. ఆర్టిస్టులు టెక్నీషియన్ లందరికీ ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు. దీంతో బయటి వారికి ఆర్టిస్టులు ఎంపిక చాలా సులభతరం అవుతుంది. సినిమా రంగంలో మా అసోసియేషన్ ఉంది కానీ మాలో మెంబర్ అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి అని తెలిపారు. ఇతర అసోసియేషన్ లోను డబ్బులు తీసుకుంటారు కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోమని స్పష్టం చేశారు పోసాని.

Read more RELATED
Recommended to you

Latest news