నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు : లారెన్స్‌

-

సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి వెళ్లి నటుడిగా మారి దర్శకుడు, నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకుని తనదైన గుర్తింపు సాధించారు. తాను సంపాదించిన డబ్బును కేవలం తనకు, తన వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాలనుకోకుండా సమాజంలో పేద వారి కోసం, ఆపన్నుల కోసం కూడా అని భావించి ఓ ట్రస్ట్ ను స్థాపించి తద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు లారెన్స్.

Raghava Lawrence to grab the missed opportunity with Lokesh Kanagaraj  through 'Kaithi 2' | Tamil Movie News - Times of India

60 మంది పిల్లలను పెంచడమే వికలాంగులకు డాన్స్ నేర్పించడం, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం, గుండె ఆపరేషన్స్ చేయించడం వంటివి చేస్తూ క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలు పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన ఛారిటీకి ఎవరూ డబ్బులు ఇవ్వకండి అని రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

లారెన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ..”నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు.. నా పిల్లల్ని నేనే చూసుకుంటాను.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒక్కడ్నే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఓ సినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది. నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు.

నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్ ” అన్నారు. ‘చంద్రముఖి 2’ ఆడియో లాంచ్ ఈవెంట్ లో లారెన్స్ నిర్వహిస్తోన్న ట్రస్ట్ కోసం కోటి రూపాయల విరాళాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రకటించారు. ఆయనకీ థ్యాంక్స్ చెప్పిన లారెన్స్, ఇకపై ఎవరూ తన ట్రస్ట్ కి సాయం చేయవద్దని కోరారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news