ప్రస్తుత సమాజం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏది జరిగినా వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక అలాంటి పోస్టుట్లో ఉండే వీడియోలు గానీ లేదా ఫొటోలు గానీ ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అందులో కొన్ని ఆకట్టుకునేలా ఉంటే మరికొన్ని కాంట్రవర్సీలకు దారి తీసి చివరకు ఇబ్బందుల్లో నెట్టేస్తుంటాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటి వీడియోనే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో నచ్చిన పోస్టులు పెట్టుకోవచ్చు గానీ శ్రుతిమించి పోస్టులు పెడితే అది మనకే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది ఇక ఇప్పుడు కూడా అలాంటి శ్రుతి మించిన పోస్టుతో ఓ వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలోని కరాడ్ ఏరియాలో నివాసం ఉంటున్న వ్యక్తి ఫేస్ బుక్ లో ఏకంగా చిరుత పులినే అమ్ముతానంటూ పోస్టు పెట్టాడు.
ఆ వ్యక్తి ఈ విధంగా పోస్టు చేస్తూ తన దగ్గర ఓ చిరుతపులి పిల్ల ఉందని, అది బాగానే ఉందని, అమ్మేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎవరికైనా కావాలంటే తనను సంప్రదించాలంటూ ఏకంగా అడ్రస్ కూడా పెట్టేశాడు. ఇలాంటి పోస్టులు చూస్తే నెటిజన్లు ఊరుకుంటారా వెంటనే విపరీతంగా షేర్ చేయడంతో ఆ పోస్టు కాస్తా ఫారెస్ట్ అధికారుల వరకు వెళ్లడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా కేవలం ఫేమస్ అయ్యేందుకే ఫేక్ పోస్టు పెట్టినట్టు తెలిసింది.