పోస్ట్ ఆఫీస్ ఏటిఎం కార్డ్ వాడుతున్నారా…? ఇవి తెలుసుకోండి…!

-

సేవింగ్స్ ఎకౌంటు, మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ ఖాతా(ఎమ్ఐఎస్‌), ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌), రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), కిసాన్ వికాస్ ప‌త్రా, సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌), ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా, వీటితో పాటు ఏటిఎం కార్డ్ సౌకర్య౦… పోస్ట్ ఆఫీస్ లో మనకు దొరికే సేవలు… వీటి ద్వారా మనకు అనేక రకాల ప్రయోజనాలు బ్యాంకింగ్ కంటే మెరుగ్గా పోస్ట్ ఆఫీస్ అందిస్తుందని కూడా పలువురు అంటున్నారు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం… పోస్ట్ ఆఫీస్ ఎటిఎం కార్డు నిభందనలు ఒక్కసారి చూస్తే…

రోజుకు రూ. 25 వేల వ‌ర‌కు పోస్టాఫీసు ఏటీఎ౦ కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. గ‌రిష్టంగా రూ. 10 వేల వ‌ర‌కు ఒకే లావాదేవీలో పోస్టాఫీసు ఏటీఎ౦ కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అన్ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఏటీఎ౦లలో ఈ కార్డు ద్వారా ఖాతాదారులు ఉచిత లావాదేవీలను నిర్వహించే అవకాశం ఉంటుంది. మెట్రో న‌గరాల‌లో ఇత‌ర బ్యాంకు ఏటీఎ౦ల వ‌ద్ద మూడు లావాదేవీలకు ఎటు వంటి చార్జీలు ఉండవు. ఇత‌ర బ్యాంకు ఏటీఎ౦ల వ‌ద్ద లిమిట్ దాటి చేసే లావాదేవీల‌కు మించి చేసే ప్ర‌తీ లావాదేవీపై రూ.20+ జిఎస్టి విధిస్తారు.

మెట్రోతో పాటు నాన్ మెట్రో న‌గ‌రాల‌కు నిర్ధేశించిన ప‌రిమితులు అన్ని ఆర్థిక‌, ఆర్థికేత‌ర లావాదేవీల‌కు వర్తిస్తాయని సదరు వెబ్ సైట్ పేర్కొంది. పోస్ట్ ఆఫీస్ ఏటీఎ౦లలో తన ఖాతాదారుల‌కు అన్ని ఉచిత లావాదేవీలను అందిస్తుంది. ఇత‌ర బ్యాంకు ఏటీఎ౦ల వ‌ద్ద 5 ఉచిత లావాదేవీల‌ను ఈ కార్డు వినియోగదారులకు కల్పిస్తుంది. ఇత‌ర బ్యాంకు ఏటీఎ౦ల వ‌ద్ద నిర్దేశించిన లావాదేవీల‌కు మించి చేసే ప్ర‌తీ ఆర్థికేత‌ర‌ లావాదేవీపై రూ.8+జీఎస్‌టీ వర్తించనుంది. ఇత‌ర బ్యాంకు ఏటీఎ౦ల వ‌ద్ద లిమిట్ దాటే లావాదేవీలపై చార్జీలు వర్తిస్తాయని ఆ వెబ్ సైట్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news