FD కి బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ బెటర్…ఎందుకంటే?

-

తమ దగ్గర ఉన్న డబ్బులను పొదుపు చేసుకునేవారికి బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ బెటర్ ఎందుకంటే వీటిలో నష్టభయం తక్కువ. రిస్క్ తక్కువ ఉండే పెట్టుబడుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒక్కటి. రిస్క్ ఇష్టపడని ఇన్వెస్టర్లు ఎఫ్‌డీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. బ్యాంకులు కన్నా పోస్టాఫీసులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులతో కస్టమర్లు మంచి వడ్డీరేట్లు ఇంకా లాభాలు పొందవచ్చు. ప్రభుత్వ హామీ, మెరుగైన భద్రత ఉండటం వల్ల ఇవి అత్యంత సురక్షితమయిన పెట్టుబడిగా చెప్పుకోవచ్చు. ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్‌డీ లను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు.

పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అకౌంట్ ఓపెన్ చేసుకోవటం కోసం కస్టమర్లు చెక్‌ లేదా క్యాష్‌ ఇచ్చి అకౌంట్ ‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఎఫ్‌డీ అకౌంట్‌ను చెక్ ద్వారా ఓపెన్ చేస్తే, డబ్బులు ప్రభుత్వ ఖాతాలో డిపాజిట్ అయిన రోజు నుండి ఎఫ్‌డీ ఖాతా తెరిచిన తేదీగా వారు పరిగణిస్తారు. రూ.1000 తో ఎఫ్‌డీ అకౌంట్‌ ఓపెన్ చేసుకోవచ్చు. పోస్టాఫీస్ ఎఫ్‌డీ లో పరిమితి లేకుండా ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. పోస్టాఫీసులో ఒక్క సంవత్సరం నుండి 5 సంవత్సరాల కాల పరిమితి వరుకు చేసుకునే ఎఫ్‌డీలపై 5.50 – 6.70 శాతం వడ్డీ రేట్లు పొందవచ్చు. ఐదేళ్ల ఎఫ్‌డీ పై అధికమయిన 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు మారేవారికి అకౌంట్‌ ను ట్రాన్స్‌ఫర్ సదుపాయం కూడా ఉంది. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఎఫ్‌డీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు ఎఫ్‌డీ అకౌంట్‌ను సులభంగా మార్చుకోవచ్చు.

పోస్టాఫీసు లో కస్టమర్లు తీసుకునే పర్సనల్ ఎఫ్‌డీ అకౌంట్ ను జాయింట్ అకౌంట్‌గా, ఒకవేళ ముందే జాయింట్ ఎఫ్‌డీ అకౌంట్ ఉంటే, దాన్ని మళ్లీ తిరిగి సింగిల్ అకౌంట్‌గా మార్చుకోనే వీలు ఉంది. ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా కస్టమర్లు నామినీని యాడ్ చేసుకోవచ్చు. మైనర్ పేరిట కూడా ఎఫ్‌డీ ఖాతా ఓపెన్ చేసి వారు మేజర్‌గా మారిన తరువాత తన పేరు మీదకు అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news