ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడితే…లాభాలే లాభాలు..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందొచ్చు. పైగా పోస్ట్ ఆఫీస్ అందించే సేవల వలన చాలా లాభాలు కూడా వున్నాయి. చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ద్వారా బెనిఫిట్స్ ని కూడా పొందుతున్నారు. ముఖ్యంగా ఈ స్కీమ్స్ లో డబ్బులను పెడితే మంచిగా లాభాలు వస్తాయి. ఈ సేవింగ్ స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే ఇంట్లో కూర్చొని మంచి లాభాలు పొందవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచడం వలన చక్కగా మనం లాభాలను పొందేందుకు అవుతుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), కిసాన్ వికాస్ పత్ర (కెవిపి) స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా ఉంటుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందేందుకు అవుతుంది. ఇది వరకు కంటే ఇప్పుడు ఎక్కువ వడ్డీ వస్తోంది.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి చూస్తే.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే చక్కటి ప్రయోజనం ఉంటుంది. మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలు. దానిని 123 నెలలకు తగ్గించారు. వడ్డీ రేటు కూడా ఇప్పుడు పెరిగింది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 7 శాతం వడ్డీ వస్తుంది.

అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి చూస్తే.. ఈ స్కీమ్ కింద ఇప్పుడు 7.6 శాతం వడ్డీ వస్తోంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అయితే 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కి మాత్రం పాత వడ్డీ రేట్లే మార్పేమి చెయ్యలేదు. అలానే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ లో ఏ మార్పు లేదు.

Read more RELATED
Recommended to you

Latest news