అదిరే పోస్టల్ స్కీమ్…ఏకంగా రెట్టింపు డబ్బులు..!

ఈ మధ్య చాలా మంది ఎన్నో స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ గురించి చూడాలి. ఈ స్కీమ్ తో అదిరే లాభాలను పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో మంచిగా లాభాలు వస్తాయి.

ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయి. రూ.1000 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మీరు ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టొచ్చు. రూ.50 వేలకు పైగా ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

ఈ స్కీమ్ కింద ప్రతీ ఏడాది 6.9 శాతం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున వడ్డీ ఇస్తున్నారు. ఇక ఎవరు ఇన్వెస్ట్ చెయ్యచ్చు అనేది చూస్తే.. 18 ఏళ్లుపైబడిన వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రెండున్నరఏళ్లు పైబడిన తర్వాత పెనాల్టీ లేకుండా డబ్బులను తీసుకోవచ్చు. వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది. ఏడాది నుంచి రెండున్నర సంవత్సరాల లోపు తీసుకోవాలనుకుంటే తక్కువ వడ్డీ వస్తుంది.