పంజాబ్ పంచాయతీ, నీటి సరఫరా మంత్రి ట్రిప్ట్ రాజిందర్ సింగ్ బజ్వా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి తమతో కలిసి పని చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. గత శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌కు కరోనా సోకింది. ఆయనతో కలిసి సమీక్షలో పాల్గొన్న మంత్రి కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు.
శనివారం వచ్చిన కరోనా రిజల్ట్‌లో నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. మరోసారి ఆయనకు మంగళవారం కరోనా టెస్ట్ చేయగా రిజల్ట్ లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంత్రికి పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు, సిబ్బంది శాంపిల్స్‌ను సేకరించి కరోనా నిర్ధారణ టెస్టులకు పంపించారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలో మంగళవారం నాటికి 8,511 కరోనా కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు 213 మంది మరణించారు.