ప్రభాస్‌ కెరీర్‌కు 18ఏళ్లు..ఈశ్వర్‌తో మొదలై పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్

-

పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన బాహుబలి ప్రభాస్‌.. వెండితెరకు పరిచయమై నేటితో 18 సంవత్సరాలవుతుంది. హీరోగా ఈశ్వర్‌ సినిమాతో ప్రభాస్‌ తన జర్నీని ప్రారంభించాడు. 2002 నవంబర్‌ 11న ఈ సినిమా విడుదలైంది. తొలి చిత్రంతో హీరోగా ప్రూవ్‌ చేసుకున్న ప్రభాస్‌.. వర్షం సినిమాతో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఛత్రపతితో చేలరేగిపోయి బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు.

కొత్త దర్శకుడు కొరటాల శివతో చేసిన ‘మిర్చి’ బ్లాక్ బస్టర్. ఇక బాహుబలితో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడమే కాదు.. తెలుగు సినిమా మార్కెట్‌ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రభాస్‌ తప్ప ఇలాంటి పాత్రను మరొకరు చేయలేరనేంత గొప్పగా ఆ పాత్రలో ఒదిగిపోయిన ప్రభాస్‌ ఇప్పుడు మూడు భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత చేసిన ‘సాహో’ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ‘రాధేశ్యామ్’తో భారీ హిట్‌ కొట్టాల్సిన సిట్యువేషన్‌లో పడిపోయాడు ప్రభాస్.

ఇక పీరియాడికల్ డ్రామా ‘ఆదిపురుష్‌’ ఈ బాధ్యతని మరింత పెంచింది. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడు పాత్రలో నటిస్తుంటే, ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిపాత్రలో నటిస్తున్నారు. ఇక నాగ్‌అశ్విన్‌ సినిమాపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ప్రభాస్‌తో జోడీ కడుతుండగా కీలక పాత్రలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తుండటం విశేషం.

తెలుగులో ఫ్లాప్ అయిన సాహో సినిమాను హిందీలో మెప్పించాడు. సినిమా బాలేదని తెలుగు ఆడియన్స్ ధియేటర్లకు రాకపోతే.. బాలీవుడ్ లో హిందీ జనాల్ని రప్పించాడు.. కలెక్షన్లు తెప్పించాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే మినిమం 300 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే. అంతటి లార్జర్ దేన్ కటౌట్ క్రియేట్ చేసుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news