అక్టోబర్ లో ప్రభాస్ ‘ఆదిపురుష్​’ నుంచి అదిరిపోయే అప్డేట్స్

-

అక్టోబర్ లో ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్​’ నుంచి వరుస అప్డేట్స్ రానున్నట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్​ స్టార్​ నటిస్తున్న పాన్​ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు సంబంధించి  అక్టోబర్​ 2న అయోధ్యలో ప్రభాస్​ టీజర్ గ్లింప్స్​ విడుదల చేయనున్నట్లు సమాచారం. మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే.. దసరా సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్.. అక్టోబర్ 5న రాం లీలాలో మైదానంలో రావణ దహనం చేయనున్నారని సమాచారం. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న టీజర్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత నవంబర్ చివరలో ట్రైలర్ విడుదల చేయొచ్చని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జనవరి 2023లో ‘ఆదిపురుష్​’ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. సాహో, రాధేశ్యామ్ వైఫల్యాలతో నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ పై భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ అక్టోబర్ అప్డేట్స్ పై వస్తున్న వార్తలతో సోషల్ మీడియా వారియర్స్ ప్రభాస్ కోసం స్పెషల్ పోస్టర్లు తయారు చేసే పనిలో పడ్డారు. 

Read more RELATED
Recommended to you

Latest news