అల్లు అర్జున్ కంటే ప్రభాస్‌కే ఎక్కువ పాపులారిటీ..!!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ స్టైలిష్ స్టార్ బన్నీ..‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ పిక్చర్ తో ఆయనకు మంచి పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను జనాలు విపరీతంగా ఆదరించారు. ఈ క్రమంలోనే బన్నీకి జనాల నుంచి ఆదరణ పెరిగిందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. ప్రభాస్ ను మించిపోతాడని పేర్కొన్నారు. కాగా, తాజాగా ఓఆర్ మ్యాక్స్ మీడియా వారి విశ్లేషణ ప్రకారం..బన్నీ కంటే ప్రభాస్ కే జనాదరణ ఎక్కువ ఉంది.

ఓఆర్ మ్యాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ తెలుగు (ORMAX STARS INDIA LOVES TELUGU) మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ కేటగిరిలో ఫస్ట్ పొజిషన్ ప్రభాస్ ను వరించింది.

రెండో స్థానం లో తారక్, మూడో స్థానంలో అల్లు అర్జున్ , నాలుగో స్థానంలో మహేశ్ బాబు, ఐదో స్థానంలో రామ్ చరణ్, ఆరో స్థానంలో పవన్ కల్యాన్, ఏడో స్థానంలో నాని, ఎనిమిదో స్థానంలో చిరంజీవి, తొమ్మిదో స్థానంలో విజయ్ దేవరకొండ, పదో స్థానంలో రవితేజ ఉన్నారు.

ఇక ఫిమేల్ స్టార్స్ విషయానికొస్తే..ఫస్ట్ ప్లేస్ లో సమంత, సెకండ్ ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ఉన్నారు. పూజా హెగ్డే, సాయిపల్లవి, అనుష్క శెట్టి, కీర్తి సురేశ్, తమన్నా, రష్మిక మందన, రకుల్ ప్రీత్ సింగ్, కృతిశెట్టి వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఈ హీరోయిన్స్ అందరూ ప్రజెంట్ తమ ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోలు సైతం ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ గత చిత్రం ‘రాధేశ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’లపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news