Prabhas- Project K: 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ప్రాజెక్ట్ కె.. ప్ర‌భాస్ రోల్ ను గుట్టుర‌ట్టు చేసిన మూవీ యూనిట్!

-

Prabhas- Project K: గ్లోబ‌ల్ స్టార్, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్(Prabhas), స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వ‌స్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ చిత్రం భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుబోతుంది. ఇండియాలోనే భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

ఇది అలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరో పాత్ర పోషిస్తాడని వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజ‌మ‌నేలా చిత్ర యూనిట్ కూడా హింట్లు ఇస్తూనే ఉంది. భిన్నమైన పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే.. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విషెస్ చెప్పుతూ.. వైజయంతీ మూవీస్ వారు .. సూపర్ హీరో ప్ర‌భాస్ అని పేర్కొన్నారు.

దీంతో ఈ భారీ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరో రోల్ లో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. ఇలా వైజయంతీ మూవీస్ అధినేతలు ప్రభాస్ ను మరింత పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టు చెప్పకనే చెప్పేశారు.

ఇక ఈ సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి మొద‌లు కానున్న‌దని టాక్. రీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ దాదాపు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నార‌ని టాక్.

మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యమేమిటంటే.. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం దాదాపు 500 కోట్ల‌కు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు
మహానటి తర్వాత గ్యాప్ తీసుకుని నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్న మూవీ కావ‌డం వ‌ల్ల క‌థ ఎలా ఉండబోతుంద‌నే ఆస‌క్తి కూడా నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Latest news