​రఫ్​లుక్​లో ప్రభాస్.. సలార్ మూవీ వీడియో లీక్

-

కృష్ణంరాజు మరణంతో షూటింగ్​లకు కాస్త గ్యాప్​ ఇచ్చిన పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ మళ్లీ షూటింగ్​ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆయన తాజాగ సలార్​ చిత్రీకరణలో పాల్గొన్నట్లు ఓ వీడియో లీకై సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పాన్​ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌-కేజీయఫ్​ ఫేమ్​ డైరెక్టర్​ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్​కు ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్​ అందింది. అయితే ఇది మూవీటీమ్​కు మాత్రం కాస్త ఇబ్బందైన విషయమే. ఎందుకంటే ఈ మూవీకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా మరోసారి ప్రభాస్​కు సంబంధించిన ఓ మేకింగ్​ వీడియో మళ్లీ లీక్ అయింది. ప్రస్తుతం అది సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందులో ప్రభాస్​ రఫ్​లుక్​లో అదిరిపోయేలా ఉన్నారు.

అయితే ఇటీవలే ప్రభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. దీంతో ప్రభాస్​.. షూటింగ్​లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇంటి దగ్గరే ఉంటూ కృష్ణంరాజుకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటున్నారు. అయితే తాజాగా లీక్​ అయిన వీడియో ద్వారా ఆయన మళ్లీ షూటీంగ్​లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియోలో హాఫ్‌ స్లీవ్‌ షర్టు, మెడలో చైన్‌తో మాస్‌ లుక్‌లో ప్రభాస్‌ దర్శనమించారు. ఇది చూసిన అభిమానులు సంతోషపడుతున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతిహాసన్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, పృధ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023లో ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్‌ ఇండియా సినిమాగా రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news