బతుకమ్మ, దసరా పండుగల కోసం అన్ని ఏర్పాట్లు : మంత్రి ఎర్రబెల్లి

-

బతుకమ్మ, దసరా పండుగల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై తన నియోజకవర్గంలో పలువురు అధికారుల, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ప్రజ‌ల పండుగ‌ల‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోందని తెలిపారు. బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర పండుగ‌గా ప్రక‌టించార‌న్నారు మంత్రి ఎర్రబెల్లి.

 

New pensions from next month, Panchayat Raj minister Errabelli Dayakar Rao  | | Mission Telangana

ప్రతి ఏటా కోటి మందికి పైగా మ‌హిళ‌ల‌కు ప్రభుత్వ కానుక‌గా చీర‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. 339.73 కోట్ల రూపాయ‌ల‌ను ఇందుకు ప్రభుత్వం ఖ‌ర్చు చేస్తోందన్నారు. దీంతో నేత‌న్నల‌కు చేతి నిండా ప‌ని దొరుకుతోంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో బ‌తుక‌మ్మ పండుగ‌ను అత్యంత వైభంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. చెరువుల వ‌ద్ద నిమ‌జ్జనానికి స‌క‌ల ఏర్పాట్లు చేయాల‌న్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రతి సారి లాగే తాను ఈ సారి కూడా నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ప‌ర్యటిస్తాన‌ని తెలిపారు. మ‌హిళ‌లు అత్యంత భ‌క్తి ప్రప‌త్తుల‌తో జ‌రుపుకునే పండుగ సంద‌ర్భంగా నిమ‌జ్జనాల స‌మ‌యంలో మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు మంత్రి ఎర్రబెల్లి.

Read more RELATED
Recommended to you

Latest news