ఆదిపురుష్ దర్శకుడికి ప్రభాస్ వార్నింగ్..రూం కు తీసుకెళ్లి మరీ !

-

ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌కు హీరో ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడట. రూం కు తీసుకెళ్లి మరీ వార్నింగ్‌ ఇచ్చాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ​ ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.

కృతిసనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. అయితే… ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను అయోధ్యలో విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ టీజర్ పై ఇప్పటికే మీమ్స్, ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ టీజర్‌ అస్సలు బాగాలేదని ప్రభాస్‌ ఫ్యాన్సే.. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ కూడా టీజర్‌ పై హర్ట్‌ అయ్యారట. టీజర్‌ తనను కూడా హార్ట్‌ చేసిందని.. దర్శకుడు ఓం రౌత్‌కు హీరో ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడట. దీనికి సాక్ష్యంగానే… ఓం రౌత్‌ నా రూం కు రా.. అంటూ ప్రభాస్‌ అన్న వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news